Skip to main content

Mega Job Mela: డిసెంబ‌ర్ 21న మెగా జాబ్‌ మేళా.. పూర్తి వివ‌రాలు ఇవే..

పల్నాడు ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డిసెంబ‌ర్ 21, 2023న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు.
Mega Job Mela in Narasaraopet  Palnadu Job Opportunities Mega Job Mela on December 21, 2023

జాబ్‌మేళా వాల్‌పోస్టర్‌ను తన కార్యాలయంలో డిసెంబ‌ర్ 13న (బుధవారం) ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల మన్నెంపుల్లారెడ్డి జెడ్పీ హైస్కూలు ఆవరణలో నిర్వహించనున్న మేళాను ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కె.సంజీవరావు మాట్లాడుతూ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. 
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సారథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు నిర్వహించే జాబ్‌మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. 

Job Mela: మాజీ సైనికోద్యోగులకు 17న జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..

జీతం వారి విద్యార్హతను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐదో తరగతి, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విభాగాల్లో చదువుకున్న 18–45 ఏళ్ల వయసు ఉన్న నిరుద్యోగ యువతి యువకులు వారి బయోడేటా, రెజ్యూమ్‌, ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌, ఆధార్‌ నకలు, పాస్‌పోర్టు ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. 

ఇతర వివరాలకు పి.శ్రీకాంత్‌ (స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌) 94921 58153, కిరణ్‌ నాయక్‌(స్కిల్‌ హబ్‌ కోఆర్డినేటర్‌) 78427 47682, నానిక నాయక్‌(జాబ్స్‌ కోఆర్డినేటర్‌) 90105 85360లను సంప్రదించాలని కోరారు. ఔత్సాహిక యువతి యువకులు ముందుగా skilluniverse/apssdc.in అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు జాబ్‌డ్రైవ్‌ జరిగే ప్రదేశంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అన్నారు. కార్యక్రమంలో ఏడీఎస్‌డీఓ రామాంజనేయులు, ప్లేస్‌మెంట్‌ అధికారి యం.రవీంద్రనాయక్‌, కో–ఆర్డినేటర్‌ వీరాంజనేయులు పాల్గొన్నారు.

Government Teacher Jobs : 30000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు.. రెండు నెల‌ల్లోనే భ‌ర్తీ.. ఎలా అంటే..?

Published date : 15 Dec 2023 03:51PM

Photo Stories