Skip to main content

Mega Job Mela: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌... 15న రాజంపేట‌లో మెగా జాబ్‌ మేళా

రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 15వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌ స్పందన హాలులో మెగా జాబ్‌మేళా పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.
Mega Job Mela
Mega Job Mela

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెగా జాబ్‌మేళాలో 80 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ జయరాజ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హరికృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: ఆ మూడు పార్టీల‌కు ఈసీ షాక్‌... ఇన్ని సీట్లు వ‌స్తేనే జాతీయ హోదా.!

చ‌ద‌వండి: ఇక‌పై వాట్సాప్‌లో స‌చివాల‌యాల సేవ‌లు... ఏపీలో మ‌రో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం

Published date : 11 Apr 2023 01:19PM

Photo Stories