Skip to main content

Latest Job Mela News: జాబ్‌మేళా

Unemployed youth encouraged to attend Job Mela by District Collector.  AP Skill Development Institute offers opportunities at Job Mela in Parvathipuram Manyam.  Latest Job Mela News   AP Skill Development Institute hosts Job Mela in Parvathipuram Manyam District.
Latest Job Mela News

ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ఈ మేరకు విజయనగరంలోని సీతం ఇంఝినీరింగ్‌ కళాశాలలో ఈనెల 31న నిర్వహిస్తున్న ప్రాంతీయ జాబ్‌మేళా పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాలో 87 బహుళ జాతి కంపెనీలలో (ఐటీ, ఫార్మా, హెల్త్‌, బ్యాంకింగ్‌, రిటైల్‌, ఆటోమోటివ్‌, టూరిజం తదితర సంస్థల్లో) 5,842 ఖాళీలను భర్తీ చేస్తారని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, బిటెక్‌, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ చదివిన యువత అర్హులన్నారు.

ఉదయం 9గంటలనుంచి జాబ్‌మేళా జరుగుతుందని, మరిన్ని వివరాలకు ఫొన్‌ 6301275511 నంబరును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ జె.వెంకటరావు, ఆర్‌డీఓ కె.హేమలత, జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ.కరుణాకర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 31 Jan 2024 08:30AM

Photo Stories