Skip to main content

Jobs in Intelligence Bureau: పది అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

Government Job Alert, Last Chance to Apply, Apply for IB Recruitment, Apply Immediately, Important Government Job Opportunity, Application Deadline Next Week, Apply Now, Intelligence Bureau, Intelligence Bureau Recruitment Application, 10th Class Qualification,
Intelligence Bureau

పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల రిలీజ్ చేసిన రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ గడువు మరో వారంలో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తిచేయడం బెటర్. ఎందుకంటే అప్లికేషన్ గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు.

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), సెక్యూరిటీ అసిస్టెంట్(SA)/మోటార్ ట్రాన్స్‌పోర్ట్(MT), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(MTS) (జనరల్) పోస్టుల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, నవంబర్ 13తో ముగుస్తుంది. 

ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్‌తో ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తంగా 677 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్(MT) పోస్టులు-362, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్)(MTS) -315 పోస్టులు భర్తీ కానున్నాయి.

అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సును పూర్తి చేసి ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్/మోటర్ ట్రాన్స్‌ఫోర్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థల వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

ముందుగా అధికారిక పోర్టల్ www.mha.gov.in‌ ఓపెన్ చేయాలి.

హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘వాట్స్‌న్యూ’ అనే కేటగిరిలో, ‘ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఎస్ఏ/ఎంటీ అండ్ ఎంటీఎస్/జెన్’ అనే లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.

ఆ తరువాత ‘అప్లై ఆన్‌లైన్’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందు పేరు, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

అనంతరం రిజిస్టర్ ఐడీ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను నింపాలి.

ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.


జీతభత్యాలు
ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య లభిస్తుంది. మల్టీ స్టాఫ్ టాస్కింగ్ పోస్ట్‌కు రూ.18,000 నుంచి రూ.56,900 మధ్య ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులు కేవలం రూ. 50 ఫీజుగా పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఇపే లైట్ ద్వారా నవంబర్ 13లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్-1(ఆబ్జెక్టివ్), టైర్-2(డిస్క్రిప్టివ్) ఎగ్జామ్స్ ఉంటాయి. తరువాతి దశల్లో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(సెక్యూరిటీ అసిస్టెంట్ కోసం), ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2 ఎగ్జామ్స్‌లో కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు.
 

Published date : 08 Nov 2023 08:08AM

Photo Stories