Job Mela: నిరుద్యోగులకు ఉపాధి కల్పనకే జాబ్‌మేళా
పార్వతీపురంటౌన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకే ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఈనెల 15న నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారి యు.సాయికుమార్ మాట్లాడుతూ ఈ మేళాకు 16 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదోతరగతి నుంచి బీటెక్, ఎంఎస్‌సీ చదివిన అభ్యర్థులు స్కిల్ యూనివర్స్.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 6305110947,6303493720 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాయత్రి కళాశాల కరెస్పాండెంట్ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: APPSC Group 1 Notification: నిరుద్యోగులకు మరో శుభవార్త
Tags
- Job mela
- unemployed
- Employment
- AP State Skill Development Institute
- Job Fair
- Job Mela Poster
- Skill Development
- Education News
- Job mela
- Job Fair
- GayatriDegreeCollege
- Parvathipuram Manyam District Mini Job Mela 2023
- SkillDevelopment
- JobOpportunities2023
- latest jobs in2023
- sakshi education job notifications