Skip to main content

Job Mela: వైఎస్ఆర్(కడప) జిల్లాలో రేపు జాబ్‌ మేళా..

డిసెంబ‌ర్ 22న (శుక్రవారం) ఉదయం 9.00 గంటలకు కడపలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వ‌హించ‌నున్నారు.
Job Mela on December 22nd

జిల్లా ఉపాధి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఆ శాఖ అధికారి సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 16 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని.. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఎంపికై నవారికి హోదాను బట్టి వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

APPSC Group-1,2: గ్రూప్‌–1,2 పరీక్షల‌కు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి..

Published date : 21 Dec 2023 05:51PM

Photo Stories