Skip to main content

Job Mela: డిసెంబ‌ర్ 15న బుక్కపట్నంలో జాబ్‌మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డిసెంబ‌ర్ 15న బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ ఖయ్యూం, కళాశాల ప్రిన్సిపాల్‌ ముక్బల్‌ హుస్సేన్‌ డిసెంబ‌ర్ 13న (బుధవారం) ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela at Bukkapatnam Degree College Job opportunities for unemployed youth

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 15వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే వారు బయోడేటాతో పాటు ఆధార్‌కార్డు, విద్యార్థత ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని, హైదరాబాద్‌లో 70 ఉద్యోగాలకు, జిల్లాలో 71 ఉద్యోగాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు 79815 41994 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

Mega Job Mela: డిసెంబ‌ర్ 21న మెగా జాబ్‌ మేళా.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 15 Dec 2023 11:25AM

Photo Stories