Job Mela: జాబ్‌మేళాలో 109 మంది ఉద్యోగాలకు ఎంపిక
స్థానిక వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ జాబ్‌మేళాలో ఎఫ్ట్రానిక్స్, చందు సాఫ్ట్ టెక్నాలజీస్, హెటిరో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, నవత ట్రాన్స్‌పోర్ట్, వరుణ్ మోటార్స్, రిలయన్స్, జియో వంటి 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 423 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవగా 109 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 128 మంది శిక్షణ అనంతరం ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అధికారులు ఎస్.నవీన్‌కుమార్, ఎన్.ధనుంజయరావు, ఉపాధికల్పన అధికారి విక్టర్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.హెచ్.వి.ప్రసాద రావు, కరస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య, ట్రైనింగ్ అధికారి జయరాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Anganwadi Jobs Notification 2024: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..