AP Skill Development: 13న డోన్‌లో జాబ్ మేళా
డోన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 13వ తేదీన స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా అధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్టోబర్ 9న జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్లను ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన విడుదల చేశారు. పలు ప్రముఖ కంపెనీలు హాజరయ్యే ఈ మేళాకు పది, ఆపై విద్యార్హత కలిగిన నిరుద్యోగులు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రెండు ఫొటోలను తెచ్చుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94402 24291, 95426 43747 నంబర్లకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ డీఈ గోపి, ప్రభుత్వ ఐటీఐ శిక్షకులు రాముడు, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: SVPNPA Recruitment 2023: నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు