Skip to main content

Job Mela: జాబ్‌మేళా రేపు

Local Job Opportunities,job mela,Srikakulam New Colony Job Fair,Nehru Yuva Kendra Venue,Wednesday Job Fair
job mela

శ్రీకాకుళం న్యూకాలనీ: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ గ్యారేజ్‌కు ఆనుకుని ఉన్న నె హ్రూ యువ కేంద్రంలో బుధవారం జా బ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపా ధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌, హీరో మోటోకార్స్‌ లిమిటెడ్‌, డైకిన్‌ కంపెనీ, నవత రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, బీ ఫార్మసీ, డీఫార్మసీ, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హతలు కలిగి 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన యువతీ యువకులు, నిరుద్యోగులు తమ బయోడేటాతోపాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ ఫొటోలతో నెహ్రూ యువకేంద్రం వద్దకు బుధవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కొత్తలంక సుధ కోరారు.

Published date : 27 Sep 2023 09:44AM

Photo Stories