Skip to main content

Coal fields Jobs: ప‌ది, ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే

కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. మొత్తం 330 ఖాళీల్లో మైనింగ్‌ సర్దార్‌-77, ఎలక్ట్రీషియన్‌ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) టెక్నీషియన్‌-126, డిప్యూటీ సర్వేయర్‌-20, అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌)-107 పోస్టులు ఉన్నాయి. ప్ర‌తీ పోస్టుకు వేర్వేరుగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్ నిర్వ‌హిస్తారు. మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. ఎస్సీ అభ్య‌ర్థుల‌కు మినిమం 30, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 36 మార్కులు సాధించాలి. పరీక్ష ఫలితాలను సీసీఎల్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
Central Coalfields Limited Jobs
Central Coalfields Limited

మైనింగ్‌ సర్దార్‌ పోస్టు
మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు ప‌ది పాసవ్వాలి. మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ లేదా మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉండాలి. ఓవర్‌మ్యాన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

చ‌ద‌వండి: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే
ఎలక్ట్రీషియన్‌ 
ఎలక్ట్రీషియన్‌ (నాన్‌-ఎక్స్‌కవేషన్‌/టెక్నీషియన్‌) పోస్టుకు ప‌ది పాసై, ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పూర్తవ్వాలి. నిబంధనల ప్రకారం.. ఎల్‌టీ పర్మిట్‌ లేదా 440-550 ఓల్ట్స్‌ మైనింగ్‌ పార్ట్స్‌ పర్మిట్, కేబుల్‌ జాయినింగ్‌లో హెచ్‌టీ పర్మిట్‌ ఉండాలి. అలాగే  డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుకు కూడా ప‌దో త‌ర‌గ‌తి పాసైన వారు అర్హులు. మైన్స్‌ సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు ప‌ది పాసై, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. 

చ‌ద‌వండి: క‌ర్నూలు తొలి మ‌హిళా క‌లెక్ట‌ర్‌గా సృజన... తండ్రి ప‌నిచేసిన జిల్లాకే క‌లెక్ట‌ర్‌గా
వీరే అర్హులు....
వయసు ఏప్రిల్ 19వ తేదీ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట‌ వయసు 35, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్‌) అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడ‌దు.
దరఖాస్తు ఫీజు: రూ.200 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, కోల్‌ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఫీజు చెల్లించనవసరం లేదు. 
ఎంపికైన వారికి జీతాలు ఇలా...
ఎలక్ట్రీషియన్‌: Rs. 1087.17/- రోజుకి
మైనింగ్‌ సర్దార్‌ : నెల‌కు -Rs. 31,852.56  

చ‌ద‌వండి: ఇక‌పై వాట్సాప్‌లో స‌చివాల‌యాల సేవ‌లు... ఏపీలో మ‌రో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం
అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌): నెల‌కు - Rs. 31,852.56 
డిప్యూటీ సర్వేయర్‌ : నెల‌కు - Rs. 31,852.56
దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2023
రాత పరీక్ష: 05.05.2023
ఫలితాల ప్రకటన: 29.05.2023  
వెబ్‌సైట్‌: https://www.centralcoalfields.in

Published date : 12 Apr 2023 03:12PM

Photo Stories