Apprenticeship Fair: ITIలో అప్రెంటిస్‌షిప్ మేళా
Sakshi Education
కాజీపేట: కాజీపేట ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఈ నెల 11న మెగా అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సి పాల్ అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, వెల్డర్, స్టేనోగ్రఫీ తదితర ట్రేడ్‌లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోగా హాజరు కావా లని కోరారు. ఎస్‌ఎస్‌సీ మెమో, ఐటీఐ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో రావాలని సూచించారు.
Published date : 07 Sep 2023 04:52PM