AP Police recruitment: 391 మంది తుది రాత పరీక్షకు ఎంపిక
Sakshi Education
కర్నూలు : పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో నాల్గవ రోజు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో 800 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 566 మంది హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. అనంతరం వారందరికీ సామర్థ్య పరీక్షలు (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు) 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు పరీక్షలో 503 మంది అభ్యర్థులు పాల్గొని 451 మంది, వంద మీటర్ల పరీక్షలో 451 మంది పాల్గొని 291 మంది, లాంగ్‌జంప్‌లో 451 మంది పాల్గొని 376 మంది ప్రతిభ కనపరిచారు. వీరందరిలో 391 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు.
Also read: 6511 AP Police Jobs | AP Police Constable పరీక్షలో అడిగే ప్రశ్నలు-సమాధానాలు
Published date : 30 Aug 2023 06:39PM