Skip to main content

Anganwadi jobs: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు

Opportunities in Child Development: Anganwadi worker positions available , Anganwadi jobs, Job opportunities for Anganwadi roles,  Anganwadi positions open in  villages – Apply today
Anganwadi jobs

జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి అధికారి కె.అనంతలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనకాపల్లి డివిజన్లో కార్యకర్త పోస్టులు–3, ఆయాలు– 37, మినీ కార్యకర్త–8తో కలిపి మొత్తం 48 పోస్టులు ఉన్నాయన్నారు. నర్సీపట్నం డివిజన్లో కార్యకర్త పోస్టులు– 6, ఆయాలు– 17, మినీ కార్యకర్త–1 కలిపి మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల లోపు వయసు, పదో తరగతి విద్యార్హతతో, స్థానికులైన వివాహిత మహిళలు అర్హులన్నారు.

ఈ నెల 24 నుంచి డిసెంబరు 4 సాయంత్రం 5 గంటల్లోగా సంబందిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయానికి నేరుగా/రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా చేరేలా దరఖాస్తులు అందజేయాలన్నారు.

Published date : 25 Nov 2023 10:25AM

Photo Stories