Written Test: 235 మంది మహిళలు రాత పరీక్షకు ఎంపిక
Sakshi Education
కర్నూలు: పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో ఐదవ రోజు సామర్థ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్‌కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో 700 మంది మహిళా అభ్యర్థులను ఆహ్వానించగా 449 మంది హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, బరువు కొలతలు నిర్వహించారు. అనంతరం వారందరికీ సామర్థ్య పరీక్షలు(ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్) 1,600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు చేపట్టారు. వీరందరిలో 235 మంది మహిళా అభ్యర్థులు తుది రాత పరీక్ష (మెయిన్స్)కు ఎంపికయ్యారు.
Published date : 31 Aug 2023 08:45PM