Job Fair: జాబ్‌మేళాలో 134 మంది ఎంపిక
కంచరపాలెం: జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్క్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్(ఏపీ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 134 మంది ఎంపికయ్యారు. హనీ గ్రూప్, ఫ్లిప్‌కార్డ్, శ్రీరామ్ జనరల్ ఇన్స్యూరెన్స్, వరణ్ మోటార్స్, హెటిరో లాబ్స్, జయభేరి ఆటోమోటివ్, గేమ్స్ సాప్ట్, రక్షిత్ బిజినెస్ సర్వీసెస్, ఎంఏఎస్ మైరెన్ సర్వీసెస్, ఆస్ట్రోటెక్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీల్లో 416 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు చేపట్టారు. 327 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. 134 మంది అభ్యర్థులను ఆయా కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు సిహెచ్ సుబ్బిరెడ్డి(క్లరికల్), పి.శాంతి(టెక్నికల్) తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వీరి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.
చదవండి: Degree College Seats: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు