Skip to main content

Howard Tucker: వందేళ్ల వయసులోనూ సేవ‌లు.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు.. ఆయ‌న భార్య కూడా!

వారం రోజులు వ‌రుస‌గా ఆఫీసుకు వెళ్తే చాలు.. సెలవు ఎప్పుడు దొరుకుతుందా.. ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అని చూస్తుంటాం.. ఒంట్లో కొంచెం న‌ల‌త‌గా ఉన్నా ఆ రోజు ప‌ని మానేసి రెస్ట్ తీసుకోవాల‌ని అనుకుంటాం.. కానీ కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్‌కు చెందిన ఓ డాక్టర్‌.

ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్‌ హోవర్డ్‌ టక్కర్‌ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్‌ ప్రాక్టీసింగ్‌ డాక్టర్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు. 
క‌రోనా బారిన ప‌డినా వ‌ద‌ల్లేదు..
తన 100వ బర్త్‌డే తరువాత జూలైలో కోవిడ్‌ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్‌లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించి టక్కర్‌.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్‌ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్‌ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన.. చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్‌ సైకోఎనలిస్ట్‌ అయిన టక్కర్‌ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది. భార్యాభ‌ర్త‌లిద్దరూ వ‌`ద్దాప్యంలోనూ వైద్య సేవలను అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

Success Story : 70 ఏళ్ల‌లో ప‌ది పాస్‌.. ఈ పెద్దాయ‌న ఆశ‌యం ఏమిటంటే..

Published date : 23 Nov 2022 04:50PM

Photo Stories