Exam Centres: పరీక్షలకు నిరంతరాయ విద్యుత్
మంగళవారం ఆయన నగరంలోని సబ్‌స్టేషన్, ఎస్‌పీఎం, స్టోర్స్‌ను పరిశీలించారు. అనంతరం అర్బన్ ఈఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. డైరెక్టర్ మాట్లాడుతూ సబ్‌స్టేషన్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ రిజిస్ట్రర్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 టోల్ ఫ్రీ నంబరుకు వినియోగదారులు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. చిత్తూరులో త్వరలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్టోర్స్‌కు నూతన భవనం మంజూరు అయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. సకాలంలో విద్యుత్ పరికరాలు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలని సూచించారు. గ్రామాలకు త్రీఫేజ్ కరెంటును ఇచ్చేందుకు ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. బిల్లులు చెల్లించని ప్రైవేటు సర్వీసులకు విద్యుత్ సరఫరా ఆపివేయాలన్నారు. చిత్తూరు అర్బన్, రూరల్ పరిధిలో వ్యవసాయ సర్వీసుల పరంగా కస్టమర్ చార్జీల బకాయిలు రూ.1.50 కోట్లు ఉందని వివరించారు. సమావేశంలో ఈఈలు హరి, పద్మనాభపిళ్‌లై, డీఈలు శేషాద్రి, జ్ఞానేశ్వర్, జయప్రకాష్, ఆనంద్, కొండయ్య, సుబ్రమణ్యం, ఏఏఓ గీత పాల్గొన్నారు.