TS Schools & Colleges Holidays : విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం.. ఎందుకంటే..?
మరో మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ఈ తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. జూలై 14వ తేదీన (గురువారం) నుంచి మళ్లీ విద్యాసంస్థలు ఓపెన్ చేసే అవకాశం కన్పించడం లేదు. అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్న క్రమంలో తెలంగాణలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Schools Holidays : మూడు రోజులు పాటు పాఠశాలలు సెలవులు.. కారణం ఇదే..
ముఖ్యంగా హైదరాబాద్ లో..
ముఖ్యంగా తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.
TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..
11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ..
ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?