Urdu Schools : ఉర్దూ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను డీఎస్సీతో భర్తీ చేయాలి..
హిందూపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు వెయ్యి ఉపాధ్యాయ పోస్టులను త్వరలో నిర్వహించే డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రుట) రాష్ట్ర వర్కింట్ ప్రెసిడెంట్ కె.ఫైరోజ్ అహమ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం హిందూపురంలోని అజీజియా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రుట సమావేశం జరిగింది.
ముఖ్య అతిథి ఫైరోజ్ అహమ్మద్ మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలల్లో 238 ఉర్దూ భాషాపండితులను నియమిస్తామని చెప్పిన ఉన్నతాధికారులు ఆరు నెలలైనా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వరకు ఉర్దూ మీడియం సబ్జెక్టు టీచర్ల స్థానాల్లో ఉర్దూ వర్ణమాల రాని ఇతర మీడియం ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వెంటనే ఆ ఉపాధ్యాయులను వెనక్కు రప్పించి ఆయా స్థానాల్లో ఉర్దూ విద్యావలంటీర్లను నియమించాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
జిల్లా సీఎంఓ, ఏఏఎమ్‌ఓ అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాలల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగప్ప, అజీజియా కాంప్లెక్స్ చైర్మన్ రంగనాయకులు, లెక్చరర్స్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ రఫీక్, ఆరిఫ్ అమిని, లనీస్, షేక్‌ఖాజావలి, ముస్తాక్ అహమ్మద్, నూర్ షరీఫ్, షఫీవుల్లా, మహమ్మద్ అన్సార్, మహమ్మద్ ఇర్షాద్, ఇర్ఫాన్ కౌసర్, కరీం, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.
Assembly Elections: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు.. 99 మందితో భాజపా మొదటి జాబితా