Holiday: రేపు విద్యాసంస్థలకు సెలవు
Sakshi Education
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం నవంబర్ 19వ తేదీన పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ఇక తిరుపతి నగరం ఎటుచూసినా చెరువును తలపిస్తోంది. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు ప్రహహిస్తోంది. రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద చేరింది. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
Published date : 18 Nov 2021 05:14PM