School Teachers: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్..!
Sakshi Education
ఉపాధ్యాయులపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు అనంతరం అధికారులు పాఠశాలను సందర్శించి తనిఖీలు చేపట్టారు..
కరీంనగర్: హన్మాజిపల్లె ఎంపీపీఎస్ ఉపాధ్యాయురాలు డి.భాగ్యలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఆమె విధులకు గైర్హాజరవుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎంపీపీ ఫిర్యాదు చేశారన్నారు. గురువారం పాఠశాలను సందర్శించగా నిజమేనని తేలిందన్నారు.
Free Coaching: పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం
దీంతో ఆమెను సస్పెండ్ చేశామని, ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వచ్చినందున నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
LCA Tejas Mk1A: తేజస్ మార్క్1ఏ సక్సెస్.. మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం ఇదే..
Published date : 29 Mar 2024 05:07PM