Scholarships: ఓన్‌జీసీలో 2వేల మందికి స్కాలర్‌షిప్... ఏడాదికి 48 వేలు.. పూర్తి వివరాలు ఇవే
అలాగే 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకార వేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
2 వేలల్లో సగం అమ్మాయిలకే....
ఓన్‌జీసీ మొత్తం 2 వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందివ్వనుంది. అయితో ఇందులో సగం అంటే 1000 స్కాలర్‌షిప్‌లను అమ్మాయిలకే కేటాయించింది.
ఎవరు అర్హులు అంటే...
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/ జియాలజీ ప్రోగ్రామ్‌లలో మొదటి ఏడాది చదివే వారు దరఖాస్తుకు అర్హులు. అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదాయం ఎంత ఉండాలంటే...
జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు.
చదవండి: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ
ఎవరెవరికి ఎన్నంటే...
ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులలకు – 1000
ఓబీసీ విద్యార్థులకు – 500
జనరల్/ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు – 500 చొప్పున స్కాలర్‌షిప్స్ కేటాయించారు.
ఎంపిక విధానం...
అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేది – 06.03.2023.