Skip to main content

Sankranti Holidays : సంక్రాంతికి ఎన్ని రోజులు సెల‌వులంటే..?

జనవరి నెల‌లో భారీగా సెలవులు రానున్నాయి. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. ఏడాది ప్రారంభ నెల అయిన జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు.

ఇదే నెలలోనే రిపబ్లిక్ డే సైతం ఉంటుంది. దీంతో ఈ నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు వస్తాయి.

వ‌చ్చే ఏడాది 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

ఆదివారంతో..

Sunday holiday news

సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న‌ ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇంకా భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన‌ గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

Published date : 24 Dec 2022 08:22PM

Photo Stories