Salary Hikes : ఈ ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల్లో భారీ పెంపు..

సాక్షి ఎడ్యుకేషన్: ఉద్యోగులకు భారీ శుభవార్త తెలిపింది జీసీసీ.. దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులందరికీ వేతనాలు పెంచేందుకు నిర్ణయించింది. అందుకే, వచ్చే సంవత్సరంలో ఈ సంస్థలో పని చేస్తున్న ప్రతీ ఉద్యోగికి 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసి వెల్లడించింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో జీసీసీలు ఐటీ కంపెనీలను మించిపోయాయంది.
McDonalds 2000 jobs: తెలంగాణ ప్రభుత్వం, మెక్‌డొనాల్డ్స్ ఒప్పందం... పూర్తి వివరాలు ఇవే!
2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000 కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలో పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై జీసీసీలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయని తెలుస్తోంది.
పెంచేందుకు డిమాండ్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలు 55 శాతం కన్నా ఎక్కువ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని కూడా ఆ నివేదికలో పేర్కొంది. ఇక, జీతాల పెంపు విషయానికొస్తే.. ఆ సంస్థ రోజురోజుకు వృద్ధి చెందుతుండడంతో అక్కడ పని చేస్తున్నవారికి కూడా వేతనాలను పెంచేందుకు యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో, నైపుణ్యాలు కలిగినవారు కూడా భారీగా వేతనాలను పెంచేందుకు డిమాండ్ చేయగలుగుతున్నారు అని ఎల్ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- salaries hike
- gcc employees
- Good News for Employees
- salaries hike for gcc employees
- 55 percent gcc in hyderabad
- global capability center
- global capability center salary hikes
- employees demand
- demand for increase in salary
- GCC Report
- Hyderabad and Mumbai GCC Salaries
- Education News
- Sakshi Education News
- GlobalCapabilityCenters
- JobMarket