Skip to main content

Ayodhya Ram Mandir: జనవరి 22వ తేదీ దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. తెలుగు రాష్ట్రాల‌ వ్యాప్తంగా ఉన్న ఆఫీసులకు కూడా..

అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.
Paid Holiday for All Reliance Companies on January 22    Mukesh Ambani Announces Holiday for Reliance Employees  Reliance Holiday on Jan 22nd   Reliance Industries Supports Modi's Decision   Bala Ram Prana Pratishta Celebration in Ayodhya

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు.

జనవరి 22వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. 

దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు.

Ayodhya Ram Mandir Inauguration Updates 2024 : కేంద్రం కీలక ప్రకటన.. అన్ని కార్యాలయాలకు హాలీడే.. కానీ..

Published date : 22 Jan 2024 11:07AM

Photo Stories