Tenth Public Exams : టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు ఉండాలి
గుంటూరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలోని చైర్‌పర్సన్ చాంబర్‌లో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అధ్యక్షతన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Diwali School Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దీపావళికి వరుసగా 5 రోజులు సెలవులు..
కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి యేటా జెడ్పీ పాలకవర్గ ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
రెండేళ్లుగా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అధిక మార్కుల సాధనకు ప్రయోజనం చేకూర్చిందని వరుసగా మూడో ఏడాది స్టడీ మెటీరియల్ పంపిణీకి చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను డిసెంబర్ 10లోపు విద్యార్థులకు అందించేలా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం.. పుతిన్‌తో మోదీ
నూరు శాతం ఉత్తీర్ణతకు దోహదం చేసే విధంగా ఉండడంతోపాటు జిల్లాలోని నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రూపొందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ చదువుతున్న 34,573 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉందని ఆయా జిల్లాల డీఈవోలు చైర్‌పర్సన్, సీఈవో దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
Tags
- Tenth Students
- government schools
- ZP Chairperson Kathera Heni Christina
- students education
- study materials for students
- public examinations preparations
- govt 10th class public exams preparations
- Education News
- Sakshi Education News
- GunturZPChairperson
- PublicSchools
- 10thClassExams
- GunturDistrict
- PublicExamStrategy
- GunturEducation