UG and PG Students : యూజీ, పీజీ నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్..
Sakshi Education
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2024–2025 విద్యా సంవత్సరంలో చేరిన నూతన సంవత్సరం విద్యార్థినులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ డీఈఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ అధ్యాపకులు చెప్పే పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్చుకోవాలన్నారు.
Fourth Counselling : ఈనెల 28న నాలుగో విడత కౌన్సెలింగ్..
తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థినులు దేశ విదేశాల్లో వివిధ రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో రాజేశ్వరి మూర్తి, డాక్టర్ డీఎం ప్రేమావతి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ జ్యోతి, డాక్టర్ భద్రమణి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.
Published date : 19 Sep 2024 03:47PM