Internship Program: నెలరోజుల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం!
Sakshi Education
ఇటీవలె ప్రారంభమైన నెలరోజుల ఇంటర్నషిప్ ప్రొగ్రాంను ముఖ్యఅతిథులు డీఆర్డీఓ డైరెక్టర్, జీ టెక్నాలజీ సైంటిస్ట్‌లు హాజరై ప్రారంభించి మాట్లాడారు..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో నెలరోజుల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ డీఆర్డీఓ డైరెక్టర్, జీ టెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ జి.మల్లికార్జున్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్‌షిప్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. డిఫెన్స్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య భూమిక పోషిస్తుందని, ఆర్టిఫీషియల్ రంగంలో రాణించేందుకు ఇంటర్న్‌షిప్ వేదికగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుది, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కిశోర్‌కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 24 May 2024 03:58PM