Skip to main content

New Courses: న్యాక్‌ గుర్తింపుతో కొత్త కోర్సులకు అవకాశం

new courses with NAAC recognition

రామగిరి(నల్లగొండ): న్యాక్‌ గుర్తింపుతో కొత్త కోర్సులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ అన్నారు. ఆది వారం నల్లగొండలో ఓపెన్‌ యూనివర్సిటీ రీజినల్‌ స్టడీ సెంటర్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ స్టడీ సెంటర్‌ను ఈనెల 25న న్యాక్‌ బృందం సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో నల్లగొండ రీజినల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అంతటి శ్రీనివాస్‌, డాక్టర్‌ రాజా రామ్‌, సిబ్బంది రేఖ్యానాయక్‌, రమేష్‌నాయక్‌, మహేష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

OU Distance Education: వివిద‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

Published date : 24 Jul 2023 03:08PM

Photo Stories