NEET Counselling: నీట్ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Sakshi Education
న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనిలో భాగంగా 2021-22 ఏడాదికి సంబంధించి నీట్-పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
రిజర్వేషన్ల కోటా..
ఓబీసీలకు 27 శాతం,ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సబబే అని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో మాదిరిగానే క్రిమిలేయర్.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది.
Published date : 07 Jan 2022 01:03PM