Award for Teacher: చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఉపాధ్యాయురాలికి ఇన్నొవేటివ్ అవార్డు..
Sakshi Education
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి గొప్ప గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో ఈ అవార్డును లభించుకుంది..
సాక్షి ఎడ్యుకేషన్: మండలంలోని బోదనంపాడు ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు వల్లెంస్వాతికి జాతీయ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ రత్న 2023 అవార్డు లభించింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన నవాచారి విద్యా ఇన్నోవేటివ్ టీచర్స్ సమూహ సంస్థ అవార్డు అందజేసింది.
Job Mela: రాజాంలో నేడు జాబ్ మేళా..!
విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు, గుణాత్మక విద్య, నైతిక విలువలు పెంపొందించడంతో పలు విద్య, సామాజిక సేవల్లో పాల్గొన్నందుకు అవార్డు అందజేసినట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 700 మంది దరఖాస్తు చేసుకోగా 111 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో స్వాతికి అవార్డు లభించింది.
Published date : 19 Feb 2024 01:18PM