School Laboratories : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు ప్రయోగశాలలు నిర్మించాలి..
రాయచోటి: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలోని ప్రయోగశాలలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం రాయచోటి పట్టణం నేతాజీ సర్కిల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం సైన్స్ ఉపాద్యాయుడి బాధ్యత అని, అందుకు ప్రయోగశాల సరైన వేదిక అని అన్నారు.
Junior College Meals Scheme : జూనియర్ కళాశాలలో ఈ పథకం పునరుద్దరించేందుకు నిరసన..
జిల్లా వ్యాప్తంగా 27 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, 17 స్టెమ్ ల్యాబ్‌లు, 20 పాల్ ల్యాబ్‌లు, 5 ఆస్ట్రానమీ ల్యాబ్‌లు, 250 సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయని తెలిపారు. సైన్స్ ఉపాధ్యాయులు ల్యాబ్‌లను సక్రమంగా నిర్వహించి ప్రయోగాలు, పరిశీలనలు, ఫలితాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.ల్యాబ్‌ల్లో జాగ్రత్త చర్యలను చూపించే చార్ట్‌ను వేలాడదీయాలన్నారు.
INSPIRE Manak : ఇన్స్‌పైర్ మనక్‌కు విద్యాశాఖ శ్రీకారం.. ఐడియా బాక్స్‌తో..