Kannur University: మణిపూర్ విద్యార్థులకు కేరళ బంపర్ ఆఫర్.... ఎందుకంటే
మూడు నెలల నుంచి ఐఐటీల దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా ఏ ఒక్క కాలేజీ తెరుచుకోవట్లేదు. దీంతో విద్యార్థులు అకడమిక్ ఇయర్‌ను కోల్పోవాల్సి వస్తోంది.
విద్యార్థుల చదువుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో కేరళకు చెందిన కన్నూర్ యూనివర్సీటీ మణిపుర్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. అండర్ గ్రాడుయేట్, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనే ఆకాంక్షతో ఉన్న మణిపుర్ విద్యార్థులు తమను సంప్రదించాలని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ సూచించారు.
ఇవీ చదవండి: గుజరాత్ ప్రజల మన్ననలు పొందుతోన్న తెలుగు ఎస్పీ రవితేజ... ఈయన స్వస్థలం ఎక్కడంటే...
విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో వారికి ప్రవేశం కల్పిస్తామని వీసీ పేర్కొన్నారు. ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న మణిపూర్ విద్యార్థులకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తామని చెప్పారు. తమకు ప్రవేశాలు కల్పించాల్సిందిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను మణిపుర్ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: స్టార్టప్స్ విలవిల... ఆరు నెలల్లో 17 వేల మందికి ఉద్వాసన.. రానున్న రాజుల్లో మరింతమంది
అయితే జులైలో మణిపుర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. దీంతో మణిపూర్ విద్యార్థులు కేరళ విద్యాసంస్థలను సంప్రదించడం మొదలు పెట్టారు.