Holidays: గుడ్‌న్యూస్.. కాలేజీలకు మే 20 నుంచి సెలవులు.. పున:ప్రారంభం ఎప్పుడంటే...?
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్ : తెలంగాణ జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు మే 20వ తేదీ నుంచి అమలవుతాయని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Holidays
అలాగే జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలిపింది. ఇంటర్ రెండవ సంవత్సరం తరగతులు జూన్ 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఒక వేళ వేసవి సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తే .. అటువంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది మొత్తం 221 పనిరోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది.