AP CM YS Jagan : ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు.. మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు పెట్టాం..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..
కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్ చెప్పారు.
11.02 లక్షల మంది విద్యార్థులకు..
గత ప్రభుత్వం హయాంలోని పెడింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్ అన్నారు.
Andhra Pradesh : విద్యాశాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. 5,18,740 ట్యాబ్‌లను.
ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు..
పిల్లల చదువుతోనే ఇంటింటా వెలుగులు నింపాలని నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. విద్యారంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలను పాఠశాలలకు పంపితే అమ్మ ఒడి కింద సాయం చేస్తున్నాం. అమ్మ ఒడి పథకం ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేదు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్‌లతో సమూల మార్పులు చేశాం.
మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు..
ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చాం. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు తొలి దశకు రూ.3,669 కోట్లు, రెండో దశకు రూ.8వేల కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు.. ఇలా మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా 85వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాం.
AP CM YS Jagan : ప్రభుత్వ హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయంతో పాటు.. ప్రతి రోజూ