Andhra Pradesh: 10.82 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ దొంగిలించలేని ఆస్తి.. చదువు అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం సాకారమవుతుందన్నారు.
➤ జగనన్న విద్యా దీవెన.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసే పథకం.
➤ ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
➤ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 9,274 కోట్లు.
➤ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించింది.