ITI Admissions: ఐటీఐలో విద్యార్థినులకు ప్రవేశాలు... ఆఫర్ చేస్తున్న కోర్సులు ఇవే!
Sakshi Education
సీతంపేట: స్థానిక ఐటీఐలో గిరిజన మహిళా అభ్యర్థులకు వివిధ ట్రేడ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ మూటక గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటారు మెకానిక్ వెహికల్, వెల్డర్, డ్రెస్‌మేకింగ్, కోపా కోర్సులో ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌లో ఈనెల 19 వ తేదీలోగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 22న స్థానిక ఐటీఐలో కౌన్సెలింగ్ చేస్తామన్నారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 20వ తేదీలోగా చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్: 99893 86634, 63053 02188 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Published date : 13 Sep 2023 01:02PM