ఇంజినీరింగ్ విద్యతో వినూత్న ఆవిష్కరణలు
స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ అనేది రూపకల్పన, నిర్మాణం, వినూత్న ఆవిష్కరణలు, స్థిరత్వం, అత్యాధునిక సాంకేతిక బాద్యతలను కలిగి ఉంటుందన్నారు. విజయం సాధించడంతో పాటు సమాజంపై సానుకూల ప్రభావం చూపాలన్నారు. గ్రాడ్యుయేట్లు రోబోటిక్స్, ఇంధన వనరులు, నానో టెక్నాలజీ తదితర రంగాల్లో రాణించి దేశాన్ని స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చేందుకు కృషి చేయాలని, తద్వారా భావితరాలకు మార్గదర్శకులు కావాలని అన్నారు. సహకారం, అంకితభావంతో పనిచేసి దేశ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ఆకాంక్షించారు. న్యూఢిల్లీకి చెందిన భారత ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ గత తరాలు అభివృద్ధి చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ కోవిడ్ – 19 వంటి మహమ్మారి నుంచి రక్షించిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే తరాల విద్యార్థులు సూర్యుని నుంచి ఇంధనం హైడ్రోజన్ ఎలా తీయాలో కనుగొనాలని కోరారు. గ్రాడ్యుయేట్లు సమస్యల పరిష్కారకర్తలుగా మారాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో నైతికతతో బాధ్యతాయుతమైన కొత్తతరం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీ ఆర్‌ఎస్‌వీ ప్రసాద్, జీఎంఆర్ వీఎఫ్ సీఈఓ అశ్వినిలోహని, ఎల్‌ఎం లక్ష్మణమూర్తి తదితరులు ప్రసంగించారు.
జేఎన్‌టీయూ జీవీ వీసీ
డాక్టర్ కె.వెంకటసుబ్బయ్య