Skip to main content

Skill Development: స్కిల్‌ డెవలప్మెంట్‌తో నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెంపు

యువతకు నైపుణ్యాన్ని పెంచి అందుకు తగిన ఉపాధిని కల్పించాలనే స్కిల్‌ డెవలప్మెంట్‌ను ప్రారంభానికి ముఖ్య కారణం. ఈ కార్యక్రమం ప్రారంభైన వ్యవధిలో జరిగిన అభివృద్ధులు, పొందిన లాభాలు నష్టాలు వంటి విషయాల గురించి ఈ కథనంతో తెలుసుకుందాం..
Increase skill and employment opportunities with skill development program

సాక్షి ఎడ్యుకేషన్‌: యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి మంచి అవకాశాలను అంది పుచ్చుకునే వీలు కల్పించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో కోట్లాది రూపాయలను మింగేయడం మాత్రం క్షంతవ్యం కాదు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ‘స్కిల్‌ డెవలప్మెంట్‌ సంస్థ’ ముసుగులో చేసిన నిర్వాకం నిధుల భక్షణే అనేది ఆయన అరెస్ట్‌తో తేలిపోయింది.

WTO Ministerial Meeting: అబూ ధాబీలో జరిగిన డబ్ల్యూటీవో మంత్రివర్గ సమావేశం

అసలు స్కిల్‌ డెవెలప్మెంట్‌ అంటే ఏమిటి? వ్యక్తుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, వారికి తగిన ఉపాధి కలిగేలా చూడడం కదా. తిరుపతి సమీపంలో ఉన్న ‘శ్రీ సిటీ’లో జరుగుతున్నది ఇదే. అలాగే, అందుబాటులో ఉన్న సహజ వనరులను రాష్ట్ర అభివృద్ధికి ఎలా నైపుణ్యంగా ఉపయోగించుకోవాలో దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతలదే. కానీ, ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి.

Kaziranga National Park: కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించిన మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రమారమి వెయ్యి కి.మీ. సముద్ర తీరం ఉంది. ఇక్కడ గోవాలో మాదిరిగా టెంట్స్‌ వేద్దామా, క్యాసినోలు పెడదామా, పర్యాటకులకు వినోదం పంచుదామా అనే దగ్గరే ఆయన ఆలోచనలు ఆగిపోయాయి. అంటే సముద్ర తీరాన్ని ఒక జూద కేంద్రంగా, వ్యసనపరుల క్షేత్రంగా మార్చాలని చూశారు. అదృష్టవశాత్తు ఆయన కిందటి ఎన్నికల్లో ఓడి పోవడంతో ఆ ఆలోచనకు బ్రేక్‌ పడింది. అయితే, అదే సముద్ర తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, మెరైన్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ఇప్పటి ముఖ్య మంత్రి జగన్‌ చేశారు. ఒక ‘స్కిల్‌ యూనివర్స్‌’ పోర్టల్‌ తను నెలకొల్పడానికి చేసిన కృషి ఫలిస్తోంది.

Sammakka Sarakka Central Tribal University: ఆగస్టు నుంచి ట్రైబల్‌ వర్సిటీలో క్లాసులు.. 33 శాతం రిజర్వేషన్‌లు వీరికే

ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐ శిక్షణ కేంద్రాలను ఉపయోగించుకుని యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం, కొత్త స్కిల్‌ కాలేజీలూ, యూనివర్సిటీలను పెట్టడం ద్వారా యువత ఈ పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవడానికి జగన్‌ చర్యలు చేపడుతున్నారు. 2019 వరకూ ఏపీలో అక్రిడిటేషన్‌ ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీ ఒకటే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 33 పాలిటెక్నిక్‌లు గుర్తింపు పొందాయి. ఐటీఐలను అభివృద్ధి చేశారు. ‘నాడు నేడు’ వంటి కార్యక్రమాలతో బడులను బాగు చేశారు. ఆంగ్ల మాధ్యమాన్ని దిగువ తరగతికి చేరువ చేశారు. ప్రభుత్వ బడులలో కార్పొరేటుకు ధీటుగా విద్యాభ్యాసం జరిగేలా చూశారు. ఈ తరహా పాఠశాల విద్యతో విద్యా ర్థులకు సహజంగానే నైపుణ్య స్థాయి పెరుగుతుందనడంలో సందేహం లేదు.

Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. 4 శాతం డీఏ పెంపు

పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెడుతూ, వాటితో టై అప్‌ పెట్టకొని యువతకు ట్రైనింగ్‌ ఇప్పించి ఉద్యోగాలను పొందేలా చేసే ‘భవిత’ కార్యక్రమం, సముద్ర తీరంలో ‘మెరైన్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ ఏర్పాటు, తిరుపతిలో ‘స్కిల్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలనుకోవడం వంటివి జగన్‌ విజన్‌కు కొన్ని నిదర్శనాలు మాత్రమే. విశాఖలో జగన్‌ ప్రసంగం రాష్ట్ర యువత నైపుణ్యాలు ఎలా పెరగబోతున్నాయో ఆవిష్కరింప చేసింది. ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ హబ్, జిల్లా కేంద్రంలో స్కిల్‌ కాలేజ్, ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతామంటూ జగన్‌ చేసిన ప్రకటన యువత నైపుణ్యాల అభివృద్ధి పట్ల ఆయన ఎంత కృత నిశ్చయంతో ఉన్నదీ తేటతెల్లం చేసింది.

Welfare of Employees: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత

చదువు పూర్తవ్వగానే ఉపాధి కూడా కలిగేలా చేయాలన్నది ఆయన ఆశయం. అంతేగానీ చంద్రబాబు హయాంలో మాదిరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని బీరాలు పలకడం, ఆ తరవాత వదిలెయ్యడం తన పద్ధతి కాదని జగన్‌ చెప్పకనే చెప్పారు.స్కిల్‌డెవలప్మెంట్‌ కార్యక్రమాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని బాబుకు అనుమానం రావచ్చు. ఆ అనుమానాలను పటాపంచలు చేయగలిగేలా ఎంపీ లాడ్స్‌ నిధులలో కొంత శాతాన్ని ఇందుకోసం ఉపయోగించవచ్చని సీఎం జగన్‌ అంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు ఏటా వచ్చే ఈ నిధులు స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలకు అక్కరకు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

APPSC Notification: గుడ్‌న్యూస్‌.. ఏపీలో నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేషన్లు

ప్రజలను మోసగించాలనుకునే వారి ఆలోచనలు ఎప్పడూ తిన్నగా ఉండవు. సదుద్దేశంతో పాండవులు నిర్మించుకున్న మయసభలో దుర్యోధనుడు ఏ విధంగా భంగపడ్డాడో మనందరికీ తెలుసు. ఎంత నగుబాటు పాలయ్యాడో భారత కథ చెబుతుంది. అనంతర పరిణామాలు అతని నాశనానికి దారితీశాయి. ఇప్పుడు చంద్ర బాబు విషయంలో కూడా అదే జరగబోతుందనడంలో సందేహం లేదు. జగన్‌ నిర్మించిన స్కిల్‌ సౌధం చంద్రబాబుకు రాజకీయ సమాధిని కట్టడం ఖాయం.ఇదీ బాబు నైపుణ్యానికీ జగన్‌ సామర్థ్యానికీ మధ్య తేడా.

Bank Employees: బ్యాంకు ఉద్యోగుల వేతనం పెంపు

- వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు ,మొబైల్‌ : 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాశ్‌

Published date : 09 Mar 2024 01:42PM

Photo Stories