Minister RK Roja: విద్యకు అగ్రతాంబూలం
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రతి విద్యార్థిపై ఖర్చు పెట్టే ప్రతి పైసా వారి ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి అని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు అగ్రతాంబూలం ఇచ్చారని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకుని, పోటీ ప్ర పంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే సుమారు రూ.70 వేల కోట్లకు పైగా ఒక్క విద్యారంగానికే వెచ్చించారని తెలిపారు. ఎంత స్థాయికి ఎదిగిన విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రతి ఒక్క రూ స్మరించుకోవాలని తెలిపారు. ఉన్నత సమాజం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్నారు. న వభారత నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని, అలాంటి ఉపాధ్యాయులకు దైవస్వరూపులుగా మన సమాజంలో స్థానం ఉందన్నారు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే ఆ ఉపాధ్యాయుడు నిజమైన అవార్డు అందుకున్నట్లని తెలిపారు. ఆడపిల్లల విద్య వారి భవిష్యత్తులో వెలుగులు నింపుతుందని నమ్మి బాలికా విద్యను సీఎం ప్రోత్సహిస్తున్నారని, మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గురువులను మరిచిపోకూడదని అన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు మించిన వసతులు, సౌకర్యాల కల్పన, విద్యాబోధనతో పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీవిని ఎరుగని రీతిలో డిజిటల్ విద్య, బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లతో విద్యాబోధన తీసుకువచ్చినట్లు తెలిపారు. చంద్రయాన్–3 ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వీక్షించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు అందిపుచ్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
చదవండి: Inspiring Teachers 2023: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
సమాజ స్థాపనలో గురువులదే కీలక పాత్ర
సమ సమాజ స్థాపనలో గురువులదే కీలకపాత్ర అని, అలాంటి గురువులను నిత్యం స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి అన్నారు. గురువులను గౌరవించుకుంటే సమాజాన్ని గౌరవించినట్టేనని తెలిపారు. నేటి విద్యా సదుపాయాలతో ప్రపంచంలో పోటీ పడే సామర్థ్యం మనం విద్యార్థులకు అందించగలమని ఆయన తెలిపారు.
దీపం తాను వెలుగుతున్న వరకే ఇంకో దీపాన్ని వెలిగించగలదని, అలానే ఉపాధ్యాయులు కాలానుగుణంగా వారి పరిజ్ఞానాన్ని పెంచుకుని, సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని, ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు వారిని ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు.
విప్లవాత్మక మార్పులతో నాణ్యమైన విద్య గురు పూజోత్సవంలో మంత్రి ఆర్కే రోజా
‘పేద విద్యార్థులందరూ అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు అంది పుచ్చుకోవాలి. ప్రపంచస్థాయిలో పోటీ పడాలన్న సంకల్పంతో సీఎం జగనన్న విద్యకు పెద్దపీట వేశారు.’ అని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
చదవండి: Teacher's Day Celebrations: పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
గురువుకు మించిన దైవం లేదు
గురువుకు మించిన దైవం లేదని, భగవంతుని స్వ రూపమే గురువు అని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సు బ్రమణ్యం తెలిపారు. నిస్వార్థంతో విద్యార్థి ఉన్నతే లక్ష్యంగా పాటుపడే గురువును గౌరవించడం మ నందరి కర్తవ్యవమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే అనేక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులు 80 మందిని ఘనంగా సత్కరించి, అవార్డులు అందజేశారు. డీఈఓ డాక్టర్ వి.శేఖర్, ఎస్‌ఎస్ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి, డీవైఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.