Education and Employment: ఐటీఐతో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు..
కాకినాడ సిటీ: ఐటీఐ పూర్తిచేసిన వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ కోర్సులు ముగించిన వారికి పాలిటెక్నిక్ డిప్లమాలో నేరుగా రెండో సంవత్సరం ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఐటీఐ చివరి ఏడాదిలోనే జాబ్‌మేళాలో పరిశ్రమల్లో ఉపాధి పొందే వీలుండటంతో ఐటీఐకు డిమాండ్ ఏర్పడింది. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. ఐటీఐ కోర్సు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్ ప్రారంభం.. పరీక్ష కేంద్రాలకు హాజరైనవారి సంఖ్య ఇలా!
నైపుణ్యం తప్పనిసరి..
ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఒక చక్కని మార్గంగా ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. అయితే ఐటీఐ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర నైపుణ్యాభివద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది.
10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు
ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెగ్యులర్ కోర్సులు
ఐటీల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానికల్, డ్రాఫ్ట్‌స్‌మేన్ సివిల్, ఇనుస్ట్రుమెంటేషన్ మెకానికల్ వంటి కోర్సులు ఉంటాయి. ఏడాది కాలపరిమితితో డీజిల్ మెకానిక్, వెల్డర్, కటింగ్ అండ్ సూయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ తదితర కోర్సులు ఉంటాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులు ఏ ఏ ఐటీఐల్లో ఉన్నాయో వెళ్లి పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేస్తారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుదిగడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది.
Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
ఉన్నత చదువులకు అవకాశం
ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అనంతరం బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు విద్యార్థులు నేరుగా లేటరల్ ఎంట్రీని పొంది, ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు.
రెండేళ్ల కాలపరిమితి కోర్సులు
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌స్‌మేన్ సివిల్. ఆర్‌అండ్‌ఏసీ టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్త్రుమెంట్ మెకానిక్, టర్నర్, మెచినిస్ట్.
NCC Training Camp: ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ శిబిరం ప్రారంభం.. దీనితో విద్యార్థులకు భవిష్యత్తు!
ఏడాది కాలపరిమితి కోర్సులు
మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల జూన్ 10వ తేదీ తుది గడువు. జిల్లాలో 2,432 సీట్లు, 2 ప్రభుత్వకళాశాలలు 12 ప్రైవేట్ ఐటీఐలు..
జిల్లాలో పరిస్థితి ఇదీ
కాకినాడ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో కాకినాడ, జగ్గంపేటల్లో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 12 ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల పరిధిలో 728, ప్రైవేట్ ఐటీఐల పరిధిలో 1,704 సీట్లు ఉన్నాయి. రెండు యాజమాన్యాల పరిధిలో 2,432 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి.. ఒలింపిక్స్‌లో పాల్గొనే టీటీ జట్లు ఇవే..
డ్రోన్ టెక్నాలజీపై స్వల్ప కాలిక కోర్సు ప్రారంభం
కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ ఏడాది నూతనంగా డ్రోన్ టెక్నాలజీపై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెడుతున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును గత ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్‌లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఉపాధి అవకాశాలు త్వరగా వస్తాయి
త్వరిత గతిన స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఐటీఐలో చేరగోరే విద్యార్థులు జూన్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మొబైల్ నంబర్‌కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి.
– ఎంవీజీ వర్మ, ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, కాకినాడ
APRJC Ranker: ఏపీఆర్‌జేసీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థి..