Global Teacher Awards: డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి అంతర్జాతీయ అవార్డు
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ ఎన్.ఓబిరెడ్డి అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. 110 దేశాల భాగస్వామ్యంతో ఏకేఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏటా న్యూఢిల్లీ వేదికగా గ్లోబల్ టీచర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్ 4న అవార్డులు ప్రదానోత్సవం జరిగింది. ఇందులో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ‘గ్లోబల్ టీచర్ అవార్డు’ను ఓబిరెడ్డి అందుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కళాశాలకు చేరుకున్న ఆయనను ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రాజు, కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి తదితరులు అభినందించారు. కళాశాల ప్రెసిడెంట్ పీవీ రమణారెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.నిర్మలమ్మ, వైస్ ప్రెసిడెంట్ రమేష్‌బాబు, ఈసీ సభ్యులు గోపి, ఎర్రిస్వామి, రవీంద్ర, డాక్టర్ రసూల్, ఫిరోజ్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: Nadu Nedu Scheme: రూ.310 కోట్లతో 447 జూనియర్ కళాశాలల అభివృద్ధి
నేటి నుంచి సీఆర్టీలకు శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఇటీవల కొత్తగా నియమితులైన పీజీటీ, సీఆర్టీలకు రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు నవంబర్ 16 గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ వరప్రసాదరావు, జీసీడీఓ వి.మహేశ్వరి వెల్లడించారు. నవంబర్ 21 వరకూ నగర శివారులోని బెంగళూరు–హైదరాబాద్ 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న వైవీ శివారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి మొత్తం 214 మంది పీజీటీలు, సీఆర్టీలు హాజరు కానున్నారు. వీరికి 19 మంది రీసోర్స్‌పర్సన్లు, రాష్ట్ర పరిశీలకులు శిక్షణ ఇవ్వనున్నారు.
ఆన్‌సెట్ సీఈఓ బాధ్యతల స్వీకరణ
అనంతపురం కల్చరల్: ఆన్‌సెట్ సీఈఓగా ఎస్.కరుణకుమారి నవంబర్ 15 బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఇటీవల అనంతపురం ఆన్‌సెట్ సీఈఓగా అదనపు బాధ్యతలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 15 బుధవారం ఉదయం యువజన సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: Students: విద్యార్థులు వారికిష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి