Students: విద్యార్థులు వారికిష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి
విజయనగరం ఫోర్ట్: విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కులపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను స్థానిక కేజీబీవీలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 20 వతేదీవరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి యాళ్ల నాగరాజు, మిషన్ వాత్సల్య సిబ్బంది జయలక్ష్మి, రామకోటి, వెన్నెల సంధ్య, చప్ప అరుణ్‌కుమార్, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Nadu Nedu Scheme: రూ.310 కోట్లతో 447 జూనియర్ కళాశాలల అభివృద్ధి
జీఎంఆర్ ఐటీలో వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపిక
రాజాం సిటీ: అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపిక స్థానిక జీఎంఆర్ ఐటీలో బుధవారం జరిగింది. జట్ల ఎంపికకు సంబంధించిన పోటీలను జీఎంఆర్ ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ ప్రారంభించారు. ఈ పోటీలో జేఎన్‌టీయూ జీవీ పరిధిలోని కళాశాలల నుంచి పాల్గొన్న విద్యార్థులు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. హోరాహోరీగా జరిగిన ఎంపికలో సీ్త్ర, పురుషుల విభాగంలో వేర్వేరుగా జట్లను ఎంపిక చేశామని పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ తెలిపా రు. ఎంపికై న మహిళలు డిసెంబర్ 4 నుంచి, పురుషులు డిసెంబర్ 8 నుంచి రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.