Free training: 20 నుంచి కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి కంప్యూటర్ ట్యాలీ, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి.బి.కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ 30 రోజులు ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సదుపాయంతోపాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. 19 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు కొత్తపేటలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కంప్యూటర్ ట్యాలీ కోర్సుకు 10వ తరగతి మార్కుల జాబితా కాపీ (పాస్ లేదా ఫెయిల్) జతపర్చాలన్నారు. ఈ అవకాశాన్ని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఓల్డ్ బ్యాంక్ వీధి, కొత్తపేట, 0863–2336912, 8125397953, 9700687696, 9949930155 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు.