Skip to main content

Law Cet: ఆదివారం ఉచిత మోడల్‌ లా సెట్‌..

శ్రీకాకుళంలోని ఎంపీఆర్‌ లా కాలేజీలో ఉచిత మోడల్‌ లా సెట్‌ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల అసోసియేషన్‌ స‌భ్యులు తెలిపారు..
Free Model Lawcet exam on sunday

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 2న ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీకాకుళంలోని ఎంపీఆర్‌ లా కాలేజీలో ఉచిత మోడల్‌ లా సెట్‌ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమా మహేశ్వర రావు, చౌదరి లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం ఎంపీఆర్‌ లా కాలేజీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గత పదేళ్లుగా ఉచిత మోడల్‌ లా సెట్‌ నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు హజరైన అభ్యర్థులు ఎలాంటి రసుము చెల్లించనవసరం లేదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల అసో సియేషన్‌ ప్రధాన కార్యదర్శి, చౌదరి లక్ష్మణరావును సెల్‌ నంబర్‌ 9640780728ను సంప్రదించాలని కోరారు.

KG to PG Admissions: ‘వసతి’ లేక నిరాశ

Published date : 29 May 2024 05:44PM

Photo Stories