Saeed Rashid: పిట్ట కొంచెం రాత ఘనం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ళ వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది.
చదవండి: World Record: వరల్డ్ రికార్డు నమోదు చేసిన బిహార్ వాసి
గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు్కడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు.
చదవండి: Guinness Record: గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి బాబీ.. ఓ కురు వృద్ధ శునకం!