Quality Food for Students : విద్యార్థులకు ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యమైన ఆహారం అందించాలి..
డుంబ్రిగుడ: విద్యార్థులకు మోను ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, జాప్యం జరిగితే అధికారిక చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ జూనియార్ సివిల్ జడ్జి చోడవరం, అరకు ఇన్‌చార్జి జి.స్వర్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవ అధికారి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా లీగల్ సర్వీసు ఆధ్వర్యంలో భాగంగా శుక్రవారం రాత్రి 10 గంటలకు స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. ప్రతి ఒక్క తరగతి గదిని క్షణంగా పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Union Cabinet: రెండు విమానాశ్రయాలు, మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం సూచించే మెనూకు అనుగుణంగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపాల్ భవానీకి ఆదేశించారు. రికార్డులను తనిఖీ చేశారు. స్టాక్ రూమ్‌లో సరకులను పరిశీలించారు. ఇందులో భాగంగా గదుల్లో కిటికీలకు మెష్‌లు లేకపోవడం, సైడ్ గోడలు లేకపోవడం, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ లీకేజీలను గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.
EAPCET Final Phase Of Counselling: ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
పాఠశాల ప్రాంగణంలో విద్యుత్ లేకపోవడంతో 3 ఫేజ్ విద్యుత్ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు, అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు సమకూర్చే బాధ్యత పాఠశాల సిబ్బందిదేనన్నారు. ఈ వారంలో మరోసారి పాఠశాల తనిఖీకి చేస్తామన్నారు. ప్రిన్సిపాల్ కె.భవానీ, వైస్ ప్రిన్సిపాల్ సుజాత, సిబ్బంది ఉన్నారు.
New Secretaries: ఈ శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించిన కేంద్ర ప్రభుత్వం.. వారెవరంటే..