Competitive Exams: గ్రామంలో వేల మంది పట్టాలు కొట్టి ఉపాధి సాధిస్తున్నారు..
అనిగండ్లపాడు: ఏ పోటీ పరీక్ష అయినా గ్రామానికి చెందిన ఒకరిద్దరు అయినా విజయం సాధించి తీరాల్సిందే. మండలంలోని అనిగండ్లపాడు గ్రామానికి చెందిన వారు అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాగే ప్రైవేట్ కొలువులతో పాటు, ప్రతి కుటుంబం పట్టాలు కుడుతూ ఉపాధిని పొందుతున్నారు. గ్రామంలో 3 వేల మందికి పైగా జనాభా పరదా పట్టాలు కుట్టి ఉపాధి పొందుతున్నారు.
Free Training for Unemployed: నిరుద్యోగులకు ఈ కోర్సుల్లో మూడునెలల ఉచిత శిక్షణ..
గురుకుల పాఠశాలల్లో 20 సీట్లు వీరికే...
ప్రతి ఏడాది ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో చేరేందుకు నాల్గో తరగతిలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఐదు నుంచి పదో తరగతి వరకు అక్కడ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యశిస్తున్నారు. పులిగడ్డ, నిమ్మకూరు, ముసునూరు, తాడికొండలో ఉన్న గురుకుల పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు సీట్లు సంపాదించి చదువుతున్నారు. మొదట సన్నిదానం నరసింహారావు అనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్ష కోసం కోచింగ్ ఇచ్చేవారు.
IGRUA Admissions 2024: ఐజీఆర్‌యూఏలో సీపీఎల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
తరువాత దోసపాటి దానయ్య, జి.వెంకటేశ్వరరావుతో పాటు కొందరు ఉచితంగా కోచింగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం కనకపూడి రమేష్ ట్యూటర్స్‌ను ఏర్పాటు చేసి ఎంట్రన్స్ కోసం కోచింగ్ ఇస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో మొత్తం 80 సీట్లు ఉంటే అనిగండ్లపాడు గ్రామానికి చెందిన విద్యార్థులే 20 మంది ఉంటారు. ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఏకంగా 46 మంది సాధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు.
Tribal School Teachers: గిరిజన ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాలి!
ఉద్యోగుల వివరాలు..
గ్రామంలో ఉపాధ్యాయులుగా 53 మంది, పోలీసు శాఖలో 30 మంది, కండక్టర్లుగా 35 మంది, రైల్వేలో 10 మంది, వ్యవసాయ శాఖలో 20 మంది, పశుసంవర్ధక శాఖలో 20 మంది, బ్యాంక్‌ల్లో 18 మంది, రైల్వేలో 8 మంది ఉండగా వీరితో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. ప్రైవేట్ ఉధ్యోగాల్లో 500 మందికి పైగా ఉన్నారు.
గ్రామంలో విద్యాలయాలు..
గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, యూపీ పాఠశాల, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గినా మిగిలిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. ఒక ప్రైవేట్ పాఠశాల ఉంది.