Tomorrow Bandh : సెప్టెంబర్ 26వ తేదీన బంద్.. స్కూల్స్, కాలేజీలకు..?
కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ జల వివాదం రాజుకుంటోంది. నీటి విడుదలకు అనుకూలంగా.. వ్యతిరేకంగా ఇరు రాష్ట్రాలకు చెందిన రైతులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. నీటి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడుకు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి బోర్డు ఆదేశించింది.
కర్ణాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెంట్ కురుబుర్ శంతకుమార్ ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్ చాంబర్ బంద్‌కు మద్దతుగా సెప్టెంబర్ 26వ తేదీన సెలవు ప్రకటించాలని కోరారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఈ బంద్‌కు బీజేపీ, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఈ బంద్‌కు ఓలా ఊబర్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియషన్ కూడా అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో విమానాశ్రయ క్యాబ్ సేవలపై ప్రభావం పడనుంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సైతం బంద్ కు మద్దతు పలికాయి. బంద్ కు కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘీభావం ప్రకటించింది.
దీనిపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేయొద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ది కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు సెప్టెంబరు 26న బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి.
మరో 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటిని కావేరీ బేసిన్ నుంచి తమిళనాడుకు విడుదల చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై సెప్టెంబర్ 26న నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కన్నడ అనుకూల సంఘాలు, సంస్థలు బంద్‌ను చేపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీన (మంగళవారం) రాజధాని బెంగళూరుతో పాటు కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిపై ఆయా సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.
ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, మెడికల్ షాపులు, అత్యవసర సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రో సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. ప్రయివేట్ పాఠశాలలు సైతం తెరుచుకోనున్నాయి. బంద్‌కు సంఘీభావంగా విద్యార్థులు నల్ల బ్యాడ్జీలు ధరిస్తారని ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ తెలిపారు.
Tags
- Bandh on September 26 Schools & Colleges Likely To Remain Closed
- Schools Holidays News
- due to the protest schools holidays
- due to the protest colleges holidays
- Schools and colleges may be affected and likely remain closed
- Schools and Colleges Closed 2023
- karnataka bandh 26th september
- Cauvery River water to neighboring Tamil Nadu